హైదరాబాద్: పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగించే ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపాలని, ప్రజలందరికీ శుభాలు, సుఖసంతోషాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన పర్వదినమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, ఆత్మజ్ఞానమనే దివ్యజ్యోతిని ప్రతి ఒక్కరి హృదయంలో వెలిగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పుణ్యదినాన భక్తిశ్రద్ధలతో పరమశివుడిని ఆరాధిస్తూ, దీపారాధన నిర్వహించడం ద్వారా దైవ చైతన్యాన్ని పొందాలని సూచించారు. కార్తీక పౌర్ణమి పర్వదినం భక్తి, ఆధ్యాత్మిక చింతన, సద్భావనలకు ప్రతీకగా నిలవాలని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.