ఆదిలాబాద్:
ఉట్నూర్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం:
భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. తెలంగాణ మళ్లీ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి రాబోయే రోజుల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!