తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, ఉద్యోగుల ఐక్యతే లక్ష్యంగా రాష్ట్రస్థాయి మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ జేఏసీ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈ కమిటీని నవంబర్ 18, 2026న ప్రకటించారు.
తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ చైర్మన్, అధ్యక్షుడు పులి లక్ష్మయ్య నేతృత్వంలో ఈ నియామకాలు చేపట్టారు.
మున్సిపల్ జేఏసీ కమిటీ అధ్యక్షురాలిగా పి. గాయత్రి, ప్రధాన కార్యదర్శులుగా పక్కాల రేణు సాగర్, ఎన్. సాగర్, కోశాధికారిగా సాగర్ నియమితులయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, అసోసియేట్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలతో కలిపి వివిధ మున్సిపాలిటీలకు చెందిన మొత్తం 36 మంది ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!