తెలంగాణ అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీజీ సజ్జనార్ , రెండు విభాగాల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు.

అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే తమ ప్రథమ కర్తవ్యమని సజ్జనార్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సమయాన్ని మరింత తగ్గించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వేగవంతమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా భవనాలు, వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు భద్రతా ప్రమాణాల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని  సజ్జనార్  స్పష్టం చేశారు.