ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే అల్పాహార కార్యక్రమాన్ని నాణ్యతా ప్రమాణాలతో అమలు చేయాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం అందించడం అత్యంత ముఖ్యమని, అల్పాహారం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని హరే కృష్ణ హరే రామ సంస్థను సందర్శించిన ఆయన, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న అల్పాహార తయారీ విధానం, వినియోగించే ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు. అల్పాహారం రుచికరంగా, పరిశుభ్రంగా, తగిన పోషక విలువలతో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!