ఆదిలాబాద్: హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి బీఎం సందీప్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్లను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ చైర్మన్ దేవ్తాడే మంగేష్ కుమార్, డీసీసీ జనరల్ సెక్రటరీ గౌలి సంజయ్ తదితరులు పాల్గొని రాష్ట్ర నాయకులను శాలువాలతో సత్కరించారు.
పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాలపై చర్చ:
ఈ భేటీలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, జిల్లా పార్టీ పునర్నిర్మాణం, క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం వంటి అంశాలపై జిల్లా నాయకులు వారితో సుదీర్ఘంగా చర్చించినట్లు డీసీసీ వర్గాలు తెలిపాయి. అలాగే నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!