హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ కేంద్రంలో ముఖ్యమంత్రితో మహేశ్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆత్మీయ పలకరింపులు చోటుచేసుకున్నాయి.ముఖ్యమంత్రితో మహేశ్ బాబు భేటీ కారణాలు అధికారికంగా వివరాలు అందవలసి ఉంది.
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మహేశ్ బాబు
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!