జక్కెనహళ్లి గ్రామానికి చెందిన 35 ఏళ్ల ముతురాజ్ బెంగళూరులోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వారాంతాల్లో స్వగ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో వేరే కులానికి చెందిన ఓ మహిళను ప్రేమించిన ముతురాజ్.. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ పెళ్లికి అతడి తల్లి 55 ఏళ్ల శివమ్మ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయమై తల్లీకుమారుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఇటీవల మరోసారి ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రాత్రి ఇంటి వరండాలో నిద్రిస్తున్న ముతురాజ్పై శివమ్మ దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
మరుసటి రోజు తన కుమారుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారంటూ శివమ్మ కన్నీరుమున్నీరైంది. అయితే పోలీసులు అనుమానాస్పద పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించగా బయటి వ్యక్తులు ఇంట్లోకి వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు.
దీంతో తల్లి శివమ్మపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!