మ‌నిషిని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మంచి ఆరోగ్యం కావాలి.. మంచి ఆరోగ్యం కావాలంటే శ‌రీరం స‌హ‌క‌రించాలి.. అందుకు చాలా మంది ఎన్నో ర‌కాల వ్యాయామాలు చేస్తారు.. ఎన్నో ర‌కాలుగా ఆహార నియ‌మాలు పాటిస్తారు.. కాని ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న దేశీయులే కాకుండా విదేశీయులు కూడా యోగాతో మ‌క్కువ పెంచుకుంటున్నారు. అలాంటి యోగాలో రాణిస్తూ ఆన్‌లైన్ ద్వారా విదేశీయుల‌కు క్లాసులు చెపుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు ర‌ష్మిత‌..

 

ర‌ష్మిత పుట్టి పెరిగింది తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లా.. కాని పెళ్లి త‌ర్వాత అమెరికా వెళ్లిపోయింది. అక్క‌డ ఒక వైపు జాబ్ చేస్తూనే మ‌రో వైపు యోగాతో టీచ‌ర్‌గా గుర్తింపు పొందింది. గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా అమెరికాలో యోగా టీచ‌ర్‌గా సేవ‌లందించారు. అక్క‌డి తెలుగు వారికి యోగా గురించి బోధిస్తూ, ఆరోగ్యంపై అవ‌గాహ‌న క‌ల్పించారు.  ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి యోగా గొప్ప‌ద‌నంపై వివ‌రించారు. PCOS, PCOD, థైరాయిడ్, ఇన్‌ఫర్టిలిటీ, బరువు తగ్గడం, ఫేస్ యోగా, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ వంటి సమస్యలకు అనుగుణంగా యోగా సెషన్లు నిర్వహిస్తాను అమెరికాలో త‌మ‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును సాధించుకున్నారు.  


యోగాలో గుర్తింపు


అమెరికాలో RYT 500 Hours International Certified Yoga Teacher గా ప‌నిచేస్తూనే, అదనంగా Face Yoga, Mudra Therapy, Bala Yoga, Prenatal Yoga, Postnatal Yogaలో కూడా అంతర్జాతీయ సర్టిఫికేషన్లు పొందారు. ప్రతి మహిళ జీవితంలో యోగా ఎంతో ముఖ్యమైనది. కుటుంబం, ఉద్యోగం, పిల్లలు, బాధ్యతలు... ఇలా అందరి గురించి ఆలోచిస్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తారు. కానీ రోజుకు కేవలం ఒక గంట సమయం మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి కేటాయించడం ఎంతో అవసరం అని చెపుతున్నారు ర‌ష్మిత‌..


మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం


యోగా ద్వారా మ‌హిళ‌ల ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ఉంటుంది. PCOS, PCOD, థైరాయిడ్, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు వంటి అనేక మహిళల ఆరోగ్య సమస్యలను నియంత్రించుకోవచ్చు. అలాగే శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. అమెరికాలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వారి రోజువారీ జీవితంలో వ్యాయామం ఒక ముఖ్యమైన భాగం. అదే విధంగా మన భారతదేశంలో కూడా శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన పెంచుకోవాలి.


ప్ర‌స్తుత త‌రానికి యోగా చాలా అవ‌స‌రం


ప్ర‌స్తుత స‌మాజంలో మనుషులు బిజీ అయిపోతున్నారు. ఆరోగ్యానికి కూడా త‌గినంత స‌మ‌యం ఇవ్వ‌డం లేదు. పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా నేడు యోగా ప్రతి ఒక్కరికీ చాలా అవ‌సరం. ముఖ్యంగా మహిళలకు, ఒక అవసరంగా మారింది. ఆరోగ్యకరమైన, ఆనందమైన జీవితానికి యోగా ఒక అద్భుతమైన మార్గం. అందుకే తాను యోగా ద్వారా ఎంతోమందికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వ‌గ‌లుగుతున్నాన‌నే ఆనందం ఉంది. ఇప్పుడు ఇండియా వ‌చ్చి మా ఇంట్లో ఉంటున్నాను. ఇక్క‌డి నుంచే చాలా మందికి ఆన్‌లైన్ ద్వారా  మ‌న దేశంతో, అమెరికా లాంటి ఇత‌ర దేశాల్లో సైతం యోగా క్లాసులో నేర్పుతున్నాను. అంద‌రికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాల‌నే నా ఆలోచ‌న‌ను నిరంత‌రం కొనసాగిస్తాన‌ని చెపుతోంది రష్మిత రాణి మండలోజు.