బెల్లంపల్లికి చెందిన ఎం.జె. నాయుడు దర్శకత్వం వహించి, నిర్మించిన ‘కెరుబ్’ చిత్రం పట్టణంలోని రామకృష్ణ థియేటర్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ దొంగల రాజ్ కుమార్ యాదవ్ (చింటు) నటీనటులతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం చిత్ర బృందాన్ని ఘనంగా సన్మానించారు స్థానిక ప్రతిభ సినీ రంగంలో రాణించడం పట్టణ ప్రజలకు గర్వకారణమన్నారు. ఇలాంటి చిత్రాల ద్వారా బెల్లంపల్లికి మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. స్థానిక కళాకారులను, ప్రతిభావంతులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అసం అఖిల్, మొటగారి రాజేష్, ఇప్ప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.