బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాలో శుక్రవారం కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దీపక్ నగర్ అర్బన్ పీహెచ్సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును పరిశీలించారు. గర్భిణుల నమోదు, వ్యాక్సినేషన్, కుష్టు వ్యాధి నివారణ, ఈ-సంజీవని కార్యక్రమాలను లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దివ్య, రేవంత్, అనిల్, జాహ్నవి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వద్దు..
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!