భారత సరిహద్దులకు సమీపంలో చైనా తన ప్రతిష్ఠాత్మక మెగా జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అత్యంత వేగంగా కొనసాగిస్తోంది. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్బో (భారత్‌లో బ్రహ్మపుత్ర) నదిపై 60 గిగావాట్ల (60,000 మెగావాట్లు) సామర్థ్యంతో నిర్మిస్తున్న 'మెడోగ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు' పనులకు సంబంధించి ఐఐటీ దిల్లీ అనుబంధ సంస్థ 'ఎర్త్సెన్స్ ల్యాబ్స్' తాజా శాటిలైట్ చిత్రాలను విశ్లేషించి కీలక విషయాలను వెల్లడించింది.
గ్రామాల తొలగింపు & నదీ మళ్లింపు: ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతమైన మెయిన్లింగ్ పట్టణం వద్ద గతంలో ఉన్న గ్రామాలు, వ్యవసాయ భూములను చైనా పూర్తిగా తొలగించింది. అక్కడ నదీ ప్రవాహాన్ని మళ్లించే పనులు, కొత్త రహదారులు మరియు భారీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల నిర్మాణం వేగంగా సాగుతోంది.
భారీ వ్యయం: సుమారు 1.2 ట్రిలియన్ యువాన్ల (భారత కరెన్సీలో సుమారు రూ.14 లక్షల కోట్ల నుంచి రూ.15.6 లక్షల కోట్ల వరకు) భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. నమ్చా బర్వా పర్వతం గుండా సుమారు 40 కిలోమీటర్ల సొరంగాలు నిర్మించి, ఐదు దశల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 40-50 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ నిర్మాణం దిగువ ప్రాంతాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల నీటి భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. చైనా డ్యామ్ వల్ల భవిష్యత్తులో నీటి ప్రవాహంలో వచ్చే హెచ్చుతగ్గులను, ఆకస్మిక వరద ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ కూడా అరుణాచల్ ప్రదేశ్‌లో 11,200 మెగావాట్ల 'సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు'ను ప్రతిపాదించింది
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!