డ్ర‌గ్స్‌ ర‌హిత భార‌త కోసం ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, స‌మాజంలో మంచి మార్పు కోసం ప‌నిచేస్తున్న యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్ధ న‌షా ముక్త భార‌త్ కోసం ప‌నిచేయాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు.  బుధ‌వారం నుంచి హైద‌రాబాద్ న‌గ‌రంలో చేప‌ట్టిన న‌షా ముక్త భార‌త్ పాద‌యాత్ర‌లో వైఏసీ సంస్థ బృందం పాల్గొనాల‌ని పిలుపు నిచ్చారు. డ్ర‌గ్స్ ర‌హిత స‌మాజం కోసం సంస్థ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లలో విద్యార్థుల‌కు చేప‌ట్టిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలపై ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ బాధ్య‌త‌గా ముందుకు వ‌చ్చి డ్ర‌గ్స్‌లేని భార‌త‌దేశాన్ని నిర్మించేందుకు త‌మవంతుగా కృషి చేయాల‌ని అన్నారు. వైఏసీ సంస్థ కార్య‌క్ర‌మాలు నిరంత‌రం కొన‌సాగాల‌ని సూచించారు. అనంత‌రం యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్, యాంటీ డ్ర‌గ్స్ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి, కొమ‌టి ర‌మేష్‌బాబు, జి. సాయికిర‌ణ్‌, జి. విక్ర‌మ్‌, రాజామ్మ‌ద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.