కోట్లాది రూపాయల వ్యాపారాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గంలో పయనించేందుకు ఓ వ్యాపారి కుటుంబం సిద్ధమైంది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన దిలీప్ భాయ్ భోగర్ (47), ఆయన భార్య జ్యోతిబెన్ (45), కుమార్తెలు ఛవి (22), చార్వి (14) వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న జైన దీక్ష స్వీకరించనున్నారు.
ఏటా సుమారు రూ.15 కోట్ల టర్నోవర్ కలిగిన వ్యాపారాన్ని దిలీప్ భాయ్ నిర్వహిస్తున్నారు. ఎన్నో ఏళ్ల కృషితో వ్యాపారాన్ని విస్తరించిన ఆయనకు ఓ జైన ఆచార్యుడితో పరిచయం ఏర్పడింది. దీంతో క్రమంగా జైన మతం, ఆధ్యాత్మిక జీవన విధానంపై ఆసక్తి పెరిగింది. చివరకు కుటుంబంతో కలిసి సన్యాస జీవితాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే ఆయన మూడో కుమార్తె శైలీ 2023లో జైన దీక్ష స్వీకరించింది. తాజాగా కుటుంబంలోని మరో నలుగురు కూడా దీక్షకు సిద్ధమయ్యారు. ఇందుకోసం జైన సన్యాసులతో కలిసి కొంతకాలం నివసిస్తూ కాలినడకన ప్రయాణం, ఆహార నియమాలు, నిత్య ఆచరణ వంటి కఠిన నియమాలను అలవాటు చేసుకున్నారు.
కోట్ల సంపాదనను పక్కనపెట్టి ఆధ్యాత్మిక బాట పట్టిన ఈ కుటుంబ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
జాతీయం
కోట్లు ఆస్తి వదిలి కుటుంబం అంతా సన్యాసంలోకి
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!