ఒక ప్రైవేట్ సంతానలేమి (ఫెర్టిలిటీ) క్లినిక్ యజమానిని బ్లాక్‌మెయిల్ చేసి రూ. 10 లక్షలు వసూలు చేసిన కాంగ్రెస్ నేత సుహైల్ షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్లినిక్ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు అప్‌లోడ్ చేస్తానని ఆయన సదరు డాక్టర్‌ను బెదిరించారు. దీంతో ఆందోళనకు గురైన డాక్టర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు, సుహైల్ షాజహాన్ డిమాండ్ చేసిన రూ. 10 లక్షలు చెల్లించేందుకు డాక్టర్ అంగీకరించారు. ఈ క్రమంలోనే నిందితుడు డబ్బు తీసుకుంటుండగా పోలీసులు వలపన్ని షాజహాన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ బుధవారం అతనిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరించింది.