దేశంలో ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. త్వరలో గడువు పూర్తిచేసుకుంటున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు ముహుర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నవంబర్ చివరి వారంలో ఎన్నికలు జరిగే యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్ బీర్ సింగ్ సంధూ పర్యటించనున్నారు.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషనర్ల పర్యటనకు ముందే అక్కడ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు పర్యటించబోతున్నారు. వారి పర్యటనలు ముగిశాక కమిషనర్లు పర్యటించి పూర్తి సమాచారం సేకరిస్తారు. ఎన్నికల నిర్వహణకు తగిన పరిస్ధితులు ఉన్నాయో లేదో అధికారులతో చర్చించి వివరాలు తీసుకుంటారు. వీటి ఆధారంగా తుది షెడ్యూల్ ఖరారవుతుంది. మరోవైపు ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లో యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నాయి. మణిపూర్ లో సంకీర్ణ ప్రభుత్వం, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. తాజాగా ఈసీ, ఎస్ఐఆర్ వివాదాలు, జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ల తర్వాత జరగబోయే ఈ ఎన్నికలు అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమికి కీలకంగా మారాయి.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!