అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌కు సంబంధించిన అరుదైన లాకెట్‌ వేలంలో భారీ ధర పలికింది. కేవలం మూడు వెంట్రుకలు ఉన్న ఈ లాకెట్‌ ఏకంగా 4,000 డాలర్లకు (సుమారు రూ.3.7 లక్షలు) అమ్ముడైంది.
1799లో వాషింగ్టన్‌కు సన్నిహితుడైన జాన్ గాడ్స్‌బై ఈ లాకెట్‌ను భద్రపరిచినట్లు కుటుంబ వారసులు తెలిపారు. అనంతరం ఇది ఆయన మనవరాలు జులియా టెన్ మెక్‌బ్లేయర్‌కు చేరింది. ఆమె ఇంట్లో వాషింగ్టన్ చిత్రపటం వద్ద కొన్నేళ్లపాటు ఈ లాకెట్‌ను ఉంచారు.
తర్వాత పురాతన వస్తువుల సేకరణకర్త జాన్ కె. లాటిమర్ వద్దకు చేరిన ఈ అరుదైన వస్తువు తాజాగా వేలంలో అమ్ముడైంది.
అమెరికాలో తమకు ఇష్టమైన వారి వెంట్రుకలను లాకెట్లలో భద్రపరుచుకోవడం ఒకప్పటి సంప్రదాయం. వాషింగ్టన్ కుటుంబంలోనూ ఈ ఆచారం ఉండేదని మౌంట్ వెర్నాన్ వెబ్‌సైట్ వెల్లడించింది.


గతంలోనూ భారీ ధరలు
2021లో వాషింగ్టన్‌కు చెందిన మరో వెంట్రుకల లాకెట్ 40,000 డాలర్లకు (సుమారు రూ.37 లక్షలు) అమ్ముడైంది.
ఆయన సంతకం చేసిన ఓ లేఖ వేలంలో ఏకంగా 1,09,800 డాలర్లు పలికింది.
ఒకప్పుడు జ్ఞాపకంగా భద్రపరిచిన మూడు వెంట్రుకలు.. నేడు లక్షల రూపాయల విలువైన చారిత్రక వస్తువుగా మారాయి!