హైదరాబాద్: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు స్మారకంగా హనుమకొండలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకే పరిమితం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి స్పందించారు.
కాళోజీ కళాక్షేత్రంలో ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయవద్దని, ఆ భవనాన్ని కేవలం కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకే వినియోగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలకు అనుగుణంగా భవనాన్ని వినియోగించాలని సీఎం సూచించారు. కళాక్షేత్రంలో భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, కార్యకలాపాలపై కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో చర్చించాలని కలెక్టర్‌కు ఆదేశించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!