బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: గత మార్చి 23వ తేదీన బొక్కలగుట్ట రాళ్లవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కె కె 5 గనిలో పనిచేసే సింగరేణి కార్మికుడు పోసిని వెంకటస్వామి(45) మరణించాడు. బెల్లంపల్లి పట్టణం  హనుమాన్ బస్తీకి చెందిన వెంకటస్వామికి బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు లో జీతం ఖాతా ఉండడం వల్ల అతని నామినిగా ఉన్న భార్య సుమలతకు కోటి రూపాయల బీమా చెక్కును బ్యాంకు చీఫ్ మేనేజర్ చందన్ కుమార్, సీనియర్ మేనేజర్ తరుణ్ సింగ్, బ్యాంకు ఆర్డీవో విజయ్ సంజయ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు చీఫ్ మేనేజర్ చందన్ కుమార్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంకులో ఖాతా కలిగిన ప్రతి ఒక్క బ్యాంకు వినియోగదారుడు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా కోరారు.