ఆదివారం, నవంబర్ 29న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని మోడల్ కాలనీ, పిల్లర్ నంబర్ A990 వద్ద ఉన్న ‘సంస్కృతి’ మోడల్ కాలనీ కమ్యూనిటీ హాల్లో కార్యక్రమం ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు పూజ ప్రారంభం కాగా, 10:30 గంటలకు కంఠంపాటి సోదరులు కృష్ణ ఆదిత్య, కృష్ణ శశాంక్లచే ‘కార్తీక స్వరాంజలి’ సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 108 మంది బాలబాలికలకు మాత్రమే అవకాశం కల్పించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలు అర్హులని, ఆసక్తి కలిగిన వారు ఇచ్చిన QR కోడ్ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
పిల్లలు తెలుపు లేదా ఆరెంజ్ రంగు సంప్రదాయ వస్త్రాలు ధరించి రావాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పూజ ప్రారంభమైన తరువాత పిల్లలను పూజలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పూజకు అవసరమైన సామగ్రిని సమితి సభ్యులే ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, చిన్నారుల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!