తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో సుమారు 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. చివరిసారిగా 1965లో చందనోత్సవం నిర్వహించగా, మళ్లీ ఆరు దశాబ్దాల తర్వాత స్వామివారి మూలవిరాట్‌పై పేరుకుపోయిన చందనం, సింధూరం పొరను అర్చకులు శాస్త్రోక్తంగా తొలగించారు. నవంబర్ 15న దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు ఈ పవిత్ర క్రతువుకు శ్రీకారం చుట్టారు. నవంబర్ 16 నుండి 18 వరకు చందనం తొలగింపు ప్రక్రియను పూర్తి చేసి, అనంతరం యాగశాలలో హోమాలు, సుగంధ ద్రవ్యాలు, నదీ జలాలు, సముద్రపు నీటితో పవిత్ర అభిషేకాలు నిర్వహించారు.
స్వయంభూగా వెలిసిన నాటి స్వామివారి అసలు రూపాన్ని కళ్లారా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో కొండగట్టుకు తరలివస్తున్నారు. 40 రోజుల తర్వాత మండలాభిషేకం నిర్వహించి, తిరిగి స్వామివారికి చందన విలేపనాలను ప్రారంభించనున్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!