శ్రీ హనుమాన్ దేవాలయ సనత్ నగర్ నందు శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ ఆకొండి సూర్యనారాయణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో సత్సంగ్ సభ్యులు ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో సభ్యులంతా ఒకచోట చేరి సామూహికంగా సహస్రనామాలను పఠిస్తున్నారు. విష్ణు సహస్ర నామ పరాయణంతో పాటు లింగాష్టకం కనకధారా స్త్రోత్రం హనుమాన్ చాలీసా రామ రక్షా స్త్రోత్రం ఇలా ప్రతి నిత్యం ప్రతి నామంలోనూ భగవంతుని మహిమను స్మరించుకుంటూ పారాయణం కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం పెంపొందుతున్నాయి.యువతతో పాటు పెద్దలు కూడా ఈ పారాయణంలో పాల్గొంటున్నారు అని తెలిపారు.