ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలోని హత్తిఘాట్ భూ వివాదం నేపథ్యంలో బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఎల్మల దేవన్న తన సమస్యను అధికారులకు విన్నవించేందుకు ప్రజావాణికి వచ్చాడు. ఈ క్రమంలో కలెక్టరేట్ ఆవరణలో ఒక్కసారిగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఆటోలో రిమ్స్ ఆసుపత్రికి తరలింపు:
అక్కడే ఉన్న స్థానికులు, పోలీసు సిబ్బంది వెంటనే అప్రమత్తమై అపస్మారక స్థితిలో ఉన్న రైతును ఆటోలో హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రిమ్స్‌లో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
పరామర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న:
ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న రైతు దేవన్నను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, బాధిత రైతుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యర ప్రభాకర్, బాధ రవి, కనదర్పూర్ రమేష్ తదితరులు పాల్గొన
తెలంగాణ
ఆదిలాబాద్ ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం..
క్రెడిట్: Jaidi Umer
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!