హైదరాబాద్
టీఎంఆర్ఈఐఎస్ అసిఫ్‌నగర్ బాయ్స్-1 గురుకుల పాఠశాలను విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీ చేశారు. విజిలెన్స్ అధికారి రమణ, డీఎస్పీ రమేష్ రెడ్డి, సివిల్ సప్లైస్ అధికారి నవీన్ కుమార్, ఎస్ఐ శంకర్, ప్రభాకర్ ఎన్., ఆర్ఐ తదితరులు తనిఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుకులంలోని రైస్ నిల్వలను (Rice Stock), స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. బియ్యం నిల్వలు, స్టోర్ రూమ్ పరిశుభ్రత, హైజీన్ నిర్వహణను తనిఖీ చేశారు. స్టోర్ రూమ్‌లో పరిశుభ్రత, హైజీన్ ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నట్లు గుర్తించారు.
ఈ తనిఖీ సమయంలో గురుకుల వార్డెన్ మహమ్మద్ రాజమ్మద్ అధికారులు అడిగిన వివరాలను అందించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో భాగంగా అధికారులు తనిఖీలు నిర్వహించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!