గోషామహల్ బాయ్స్-1 గురుకుల పాఠశాలను సివిల్ సప్లైస్ శాఖ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ రమేష్ తన బృందంతో కలిసి సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ ప్రాంగణం, స్టోర్ రూమ్, పరిశుభ్రత, హైజీన్ నిర్వహణను పరిశీలించారు.

విద్యార్థులతో మాట్లాడి వారికి అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి గురించి ఆరా తీశారు. భోజనం నాణ్యంగా, రుచికరంగా ఉంటోందని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా గురుకులంలో అందుబాటులో ఉన్న బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల నిల్వలను భౌతికంగా తనిఖీ చేసి, స్టాక్ రికార్డులతో సరిపోల్చారు. స్టాక్ వివరాల్లో ఎలాంటి తేడాలు గుర్తించలేదు.

గురుకులంలో పరిశుభ్రత, చక్కటి నిర్వహణ, ఆహార నాణ్యత, పారదర్శకతపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేసి అభినందించారు. ఈ సందర్భంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మహమ్మద్ గౌస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ఇటువంటి తనిఖీలు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.