ఆదిలాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం కళాకారుడిగా ఉట్నూర్‌కు చెందిన ప్రముఖ గాయకుడు మోహన్ నాయక్ సోమవారం ఆదిలాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీపీఆర్వో (DPRO) కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయన, తాజా బదిలీల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చారు.
కలెక్టర్ రాజర్షి షాతో మర్యాదపూర్వక భేటీ:
బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోహన్ నాయక్ ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను అభినందించి, తమ కళా ప్రదర్శనలు, పాటల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామీణ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!