ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలో మంగళవారం (నవంబర్ 24) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన కారు ప్రమాదానికి గురైంది. వైరా సమీపంలోని ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద వేగంగా వస్తున్న వీరి కారు అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన కోట కిషోర్ రెడ్డి, ఆయన భార్య లావణ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమారుడు ప్రణీత్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు.ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనపై వైరా పోలీసులు స్పందిస్తూ, ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామని తెలిపారు. గాయపడిన ప్రణీత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఖమ్మం రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ దంపతుల మృతి
క్రెడిట్: విక్రమ్ శ్రీరాముల
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!