హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటిరో ప్రపంచ ఆరోగ్య రంగంలో మరో అద్భుత ముందడుగు వేసింది. హెచ్‌ఐవీ నివారణ మరియు చికిత్సలో అత్యంత కీలకమైన 'లెనాకాపావిర్' జెనరిక్ వెర్షన్‌ను మరియు Capvic బ్రాండ్ పేర్లతో ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన సంస్థల్లో ఒకటిగా నిలిచి, ఆఫ్రికా దేశాలకు సరఫరా చేయడం ప్రారంభించింది. 

అమెరికా మార్కెట్లో సుమారు రూ. 23.5 లక్షల వరకు ధర పలికే ఈ ఖరీదైన ఔషధం, గిలియడ్ (Gilead) సంస్థతో కుదుర్చుకున్న నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్స్ ఒప్పందం మరియు హెటిరో కృషితో ఆఫ్రికా దేశాలకు కేవలం రూ. 3,400లకే అందుబాటులోకి రానుంది. సంవత్సరంలో కేవలం రెండుసార్లు అంటే ఆరు నెలలకొకసారి వేసుకునే ఈ ఇంజెక్షన్ హెచ్‌ఐవీ వైరస్ వ్యాప్తిని అత్యంత సమర్థవంతంగా అడ్డుకుంటుంది. 

ఇందులో భాగంగా నవంబర్ 25న ఉగాండాకు తొలి విడతగా 300 వయల్స్ చేరుకున్నాయి. దశలవారీగా జాంబియా, ఉగాండా, జింబాబ్వే దేశాలకు మొత్తం 3,00,000 వయల్స్ సరఫరా చేసేందుకు హెటిరో ప్రణాళికలు సిద్ధం చేసింది. 2027 నాటికి మరిన్ని అల్పాదాయ మరియు మధ్యాదాయ దేశాలకు (LMICs) ఈ ప్రాణరక్షక ఔషధ సేవలను విస్తరించనున్నట్లు సంస్థ ప్రకటించింది.