రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయం ఎదుట గురువారం (నవంబర్ 19) ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయ్యప్ప దీక్ష చేపట్టిన తనను సంప్రదాయ దుస్తుల్లో ఉన్నాననే కారణంతో ఆఫీసు లోపలికి అనుమతించలేదని ఓ ఉద్యోగి ఆరోపించడంతో, పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల సభ్యులు కార్యాలయం ఎదుట చేరి సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.వివరాల్లోకి వెళితే.. మనీష్ అనే యువకుడు గత రెండేళ్లుగా ఆదిబట్ల టీసీఎస్‌లో పనిచేస్తున్నాడు. తాను అయ్యప్ప మాల ధరించబోతున్న విషయాన్ని రెండు నెలల క్రితమే యాజమాన్యానికి తెలియజేశానని మనీష్ పేర్కొన్నాడు. అయితే, గురువారం విధులకు హాజరయ్యేందుకు రాగా, కంపెనీ 'డ్రెస్ కోడ్' నిబంధనలు పాటించడం లేదంటూ సెక్యూరిటీ సిబ్బంది తనను గేటు వద్దే అడ్డుకున్నారని అతను ఆరోపించాడు. డ్రెస్ కోడ్ లేకుండా మిగిలిన ఉద్యోగులను లోపలికి అనుమతిస్తూ, అయ్యప్ప దీక్షలో ఉన్న తనను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని అతను ప్రశ్నించాడు. ఈ విషయం బయటకు తెలియడంతో అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాల నేతలు టీసీఎస్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీక్షలో ఉన్న మనీష్‌ను వెంటనే విధుల్లోకి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ
అయ్యప్ప దీక్ష దుస్తుల్లో ఉన్న ఉద్యోగికి అనుమతి నిరాకరణ
క్రెడిట్: విక్రమ్ శ్రీరాముల
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!