దేశంలో రాబోయే పెళ్లిళ్ల సీజన్ సరికొత్త ఆల్ టైం రికార్డు సృష్టించనుంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకు కేవలం 25 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయని అఖిల భారత వర్తకుల సమాఖ్య 'కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' తన తాజా నివేదికలో వెల్లడించింది. అంటే దేశంలో ప్రతిరోజూ సగటున 2 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నాయి. 

ఈ పెళ్లిళ్ల సీజన్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా రూ. 7.5 లక్షల కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని CAIT అంచనా వేసింది. ఇందులో వస్తువుల కొనుగోళ్ల ద్వారా రూ. 4.05 లక్షల కోట్లు (54 శాతం), సేవల రంగం ద్వారా రూ. 3.45 లక్షల కోట్లు (46 శాతం) ఆదాయం సమకూరనుంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలపై రూ. 1.2 లక్షల కోట్లు, వస్త్రాలపై రూ. 90 వేల కోట్లు, క్యాటరింగ్ సేవలపై రూ. 75 వేల కోట్లు మరియు ఫంక్షన్ హాళ్లు, హోటళ్లపై రూ. 60 వేల కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీ-NCR ప్రాంతంలోనే సుమారు 5 లక్షల పెళ్లిళ్లు జరగనుండగా, అక్కడ ఒక్కచోటే రూ. 2.5 లక్షల కోట్ల వ్యాపారం జరగనుంది.