విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ 'బ్రెయిన్ రెయిన్–2026' గురువారం ముగిసింది. ఉమ్మడి నాలుగు జిల్లాలకు చెందిన 59 గురుకుల పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక నమూనాలను ఎమ్మెల్యే తిలకించి అభినందించారు. ఆరు విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతి, జోనల్ అధికారి ఏ.శారద, ప్రిన్సిపల్ పి.ఆర్. నిరుపమ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.