ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు పరిధిలో ఇళ్లు కోల్పోతున్న పేద ప్రజలకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధితులకు మద్దతుగా నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని నిరసన తెలిపారు.
కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం:
ధర్నా అనంతరం మాజీ మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ జిల్లా మైనారిటీ నాయకులు సయ్యద్ సాజిద్, యూనస్ అక్బానీ, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సభ్యులు మరియు స్థానిక బాధితులతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఖానాపూర్ చెరువు పరిధిలో ఏళ్లుగా నివాసముంటున్న పేద కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రత్యామ్నాయ స్థలాలు లేదా ఇళ్లు కేటాయించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!