బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: రాజ్యాంగ రక్షణాదళ్ ఆధ్వర్యంలో నెన్నెల మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ ఎండీ ఇబ్రహీం మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే తాను సర్పంచ్‌గా ఎన్నికై ప్రజలకు సేవ చేసే అవకాశం పొందానని, రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తుందని అన్నారు.

రాజ్యాంగ రక్షణాదళ్ నాయకుడు దుర్గం కృష్ణస్వామి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోమస బక్కయ్య, గట్టు భానేష్, కీసరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.