విద్యార్థుల్లో రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించేందుకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలునవంబర్ 26న రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని పి.ఎం.శ్రీ. జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించుటకై వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ తోపాటుగా డ్రాయింగ్, యోగ పోటీలను నిర్వహించినారు.
పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వీ.వీ.ఆర్. ఆచార్య అధ్యక్షత వహించి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగాలలో ఒకటని పేర్కొన్నారు. అనేక దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విజయవంతంగా కొనసాగుతుండటానికి మన రాజ్యాంగ పటిష్టత, గొప్పతనమే ప్రధాన కారణమని తెలిపారు. సీనియర్ ఉపాధ్యాయులు సత్యనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాల గురించి విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులు సమాజంలో సమానత్వాన్ని, న్యాయాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.
అనంతరం విద్యార్థులచే భారత రాజ్యాంగ పీఠికను పఠింపజేసి, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, దాని విలువలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేత విద్యార్థులకు బహుమతులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘు, అనిత రాణి, శివకృష్ణ, అమరస్వర్ణ, రమాదేవి, వీరస్వామి, నరేష్, స్వరూప,రాజు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!