చెన్నరావుపేట: అంబేద్క‌ర్‌ చిత్రపటానికి పూలమాలవేసిన  అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నిటిని నిశితంగా చదివి పరిశీలించి మన భారతదేశానికి అత్యంత దృఢమైన భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్  అందించి నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవడం  లేదని రాజ్యాంగ వ్యతిరేక శక్తుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వారు విమర్శించారు రాజ్యాంగంలోని హక్కులను ఒక్కొక్కటిగా హరిస్తూ మనస్కృతి శాస్త్రాన్ని ముందుకు తీసుకురావడానికి కుటిల ప్రయత్నాలు మనువాదులు చేస్తున్నారని భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరునికి ఉంటుందని రానున్న రోజుల్లో భారత రాజ్యాంగానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని దీన్ని భారత ప్రజలు గమనించి ఐక్యతతో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కందిక సునీల్,  నర్మెట యాదగిరి, సాదు నర్సింగారావు, రూపిక శ్రావణ్ కుమార్, కొమ్ముల బాబు, సాదు రాజు, ఆకుల పెళ్లి అజయ్, జంగిల్ భాస్కర్ మరియు కేజీబీవీ విద్యార్థినిలు  తదితరులు పాల్గొన్నారు.