తెలంగాణ రాష్ట్రానికి చెందిన‌ భూగర్భ జల శాఖకు చెందిన ‘తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ రెగ్యులేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (TGGWRMS) వెబ్‌సైట్ సైబర్ హ్యాకర్ల బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారిక పోర్టల్ అయిన ఈ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన దుండగులు, అందులో 'OnlyFans' పేరుతో 18+ అభ్యంతరకర సందేశాలను పోస్ట్ చేశారు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వినియోగదారులకు ఈ అశ్లీల సందేశాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనపై సంబంధిత సాంకేతిక నిపుణులు, సైబర్ భద్రతా విభాగం అధికారులు అప్రమత్తమై వెబ్‌సైట్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.