రాజ్యాంగ దినోత్స‌వం సంధ‌ర్బంగా గురువారం వీరారం ఉన్నత పాఠశాలలో అంబేద్క‌ర్‌ చిత్ర పటానికి పాఠశాల ప్ర‌ధానోపాధ్యాయురాలు ల‌క్ష్మి నిర్మ‌ల పూల మాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, డ్రాఫ్టింగ్ కమిటీ, పౌరుల హక్కులు, విధులు, సెక్యూలర్, ప్రజాస్వామ్యము, లౌకిక, గణతంత్ర దేశం, స్వేచ్చ, సమానత్వం తదితర అంశాలను పిల్లలు నేర్చుకొని ఒక ప్రాజెక్ట్ లాగా వివరించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు తమ ప్రాజెక్ట్ లతో విభిన్నంగా వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలో రాజ్యాంగ విలువలు పెంపొందింప చేస్తాయని హెచ్ఎం ల‌క్ష్మి నిర్మ‌ల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్‌. మధు, ఎం రవి, పి జానకి, కె.నెహ్రు, పి అనిల్ కుమార్, వి వెంకట్, యు. వెంకన్న పాల్గొని సోషల్ టీచర్ రవిని ,పిల్లలను అభినందించారు.