హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ప్రముఖ షాపింగ్ మాల్ జీవీకే వన్ కు గురువారం (నవంబర్ 26) బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే పంజాగుట్ట పోలీసులు, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ మరియు భద్రతా బృందాలు మాల్‌కు చేరుకుని ప్రాంగణమంతా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాయి.
అది నకిలీ కాల్.. ఆందోళన వద్దు
విస్తృత తనిఖీల అనంతరం మాల్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పంజాగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఇ. జహంగీర్ యాదవ్ తెలిపారు. "బాంబు నిర్వీర్య పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీ చేశాము. అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. ఇది పూర్తిగా నకిలీ కాల్ అని ధృవీకరించామని ఆయన స్పష్టం చేశారు.
మహిళ ఫోన్ కాల్‌పై దర్యాప్తు:
బంజారాహిల్స్‌లోని మాల్‌కు ఒక మహిళ గుర్తుతెలియని నంబర్ నుండి ఫోన్ చేసి బాంబు బెదిరింపునకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆ నంబర్‌ను ట్రేస్ చేయడానికి ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ ఫోన్ నంబర్ ఎవరిది, ఎక్కడి నుండి కాల్ వచ్చిందనే దానిపై సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్ఓ తెలిపారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!