వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో డెవలపింగ్ ఇన్నోవేషన్ కల్చర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (DICE) కార్యక్రమం మరియు స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (SIC) లో భాగంగా, 2026 నవంబర్ 27న కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS Kondur) విద్యార్థులకు వరంగల్‌లోని NIT–Siemens మరియు వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కేసోజు సత్యనారాయణ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సృజనాత్మకత మరియు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఆసక్తిని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉన్నత విద్యాసంస్థలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన వాతావరణాన్ని విద్యార్థులకు పరిచయం చేయడం ఈ సందర్శన ముఖ్య ఉద్దేశ్యం.విద్యార్థుల్లో నూతన ఆలోచనలను ప్రోత్సహించడం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చే విధానాన్ని అర్థం చేసుకునేలా చేయడం ఈ క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా రూపొందించారు. 

 

ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శశిధర్ నాయకత్వంలో నిర్వహించబడింది. డాక్టర్ కె. శర్మిలా రెడ్డి, ప్రెసిడెంట్ – ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (IIC), హెడ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం, మార్గదర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ముషం శ్వేత, కే.గౌతమ్ సమన్వయకర్తగా వ్యవహరించగా, ఎం. వంశీ, పి. సుబ్రహ్మణ్య సాయి సహ-సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వివిఆర్ ఆచార్య, కటకం రఘు, నేతుల స్వామి, నాగరాజు, వీరస్వామి, రమ పాల్గొన్నారు.