1920లలో ఉగాండాలో ఇడి అమిన్ జన్మించాడు. బ్రిటిష్ వలస పాలన సమయంలో సైన్యంలో చేరి తన సైనిక ప్రతిభతో క్రమంగా సైన్యంలో ఉన్నత స్థాయికి ఎదిగి కీలక నాయకుడిగా మారాడు. 1971 జనవరి 25న అప్పటి అధ్యక్షుడు మిల్టన్ ఒబోటే విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో సైనిక తిరుగుబాటు చేసి తనను తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇడి అమిన్ తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని శత్రువులుగా భావించేవాడు.ఆయన పాలనలో సుమారు లక్ష నుంచి ఐదు లక్షల మంది వరకు మరణించినట్లు వివిధ అంచనాలు చెబుతున్నాయి.

ఇడి అమిన్ తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయాల్లో ఒకటి 1972లో ఉగాండాలో నివసిస్తున్న ఆసియా మూలాల ప్రజలను 90 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించడం. 80 వేల మంది ఆసియా మూలాల ప్రజలు ఉగాండాను విడిచి వెళ్లాల్సి వచ్చింది. దీంతో వివిధ వ్యాపారం లో ఉన్న  ఆసియా మూలాల ప్రజలు తమ ఆస్తులను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఉగాండా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

1978లో ఉగాండా సైన్యం టాంజానియాపై దాడికి దిగడంతో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. టాంజానియా సైన్యం, ఉగాండా తిరుగుబాటు దళాలతో కలిసి ప్రతిదాడి చేసి 1979 ఏప్రిల్‌లో రాజధాని కంపాలా ను ఆక్రమించగా,  ఇడి అమిన్ అధికారం కోల్పోయి దేశం విడిచి లిబియా పారిపోయాడు. అక్కడ నుండి సౌదీ అరేబియా లో ప్రవాస జీవితం గడిపిన ఇడి అమిన్ 2003 ఆగస్టు 16న సౌదీ అరేబియాలోని జెడ్డాలో మరణించాడు.

ఇడి అమిన్ పాలన ప్రపంచ నియంతృత్వ చరిత్రలో ఒక భయంకప్రజల కోసం ఉండాల్సిన అధికారం.. ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారితే నియంతృత్వం ఎంత ప్రమాదకరమో ఇడి అమిన్ పాలన ప్రపంచానికి చూపించింది.