బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా.. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇరుకుల్ల మంగ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు కృషి చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింతగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఇరుకుల్ల మంగ నియామకం పట్ల పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.