బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా పెన్షన్ పంపిణీలో ప్రోటోకాల్ లో మున్సిపల్ కమిషనర్పై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితుల్లోనైనా అధికారులు ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.