ఆదిలాబాద్: జిల్లాలో ప్రజలకు పారదర్శకంగా, నాణ్యమైన పౌర సేవలను అందించడమే లక్ష్యంగా గ్రామాలు, మండలాల స్థాయిలో కొత్త మీ-సేవ కేంద్రాల కేటాయింపు ప్రక్రియను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని మసూద్ చౌక్‌లో సైఫ్ అహ్మద్ మసూద్‌కు మంజూరైన నూతన మీ-సేవ కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
దివ్యాంగుడికి ప్రోత్సాహం.. సకాలంలో సేవలకు ఆదేశం:
గత కొద్ది నెలలుగా జిల్లాలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి కొత్త మీ-సేవ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. సైఫ్ అహ్మద్ దివ్యాంగుడు కావడంతో పాటు గతంలో మీ-సేవ కేంద్రంలో పనిచేసిన అనుభవం, జెరాక్స్ దుకాణం నిర్వహిస్తున్న నేపథ్యం ఉండటంతో పూర్తి అర్హత కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఆయనకు కేంద్రం కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, తక్షణమే ఆమోదం లభించి నవంబర్ 9న మీ-సేవ ఐడీ సైతం మంజూరైందని వివరించారు. మసూద్ చౌక్‌లో ఈ కేంద్రం అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు.
అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు:
మీ-సేవ కేంద్రాల ద్వారా వివిధ ధ్రువపత్రాల జారీ, భూభారతి సంబంధిత అంశాలు, ఆలస్యంగా నమోదయ్యే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పట్టణ ప్రణాళిక వంటి అనేక కీలక సేవలను ప్రజలకు సకాలంలో అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని మీ-సేవ కేంద్రాల పనితీరుపై ఈడీఎం (EDM) ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఎక్కడైనా లోపాలు లేదా అవకతవకలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మీ-సేవ నిర్వాహకులు సైఫ్ అహ్మద్ మసూద్, ఆయన కుటుంబ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!