సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రపోడు తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నకిరేకల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ప్రమీల అనే విద్యార్థిని జ్వరం రావడంతో ఇంటికి వచ్చింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బాలికను సమీపంలోని పెదవీడులో ఉన్న ఓ ఆర్ఎంపీ (RMP) వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆర్ఎంపీ సోదరుడు మోహన్ పాషా బాలికకు గ్లూకోజ్, ఇంజెక్షన్ ఇచ్చాడు. అయితే, ఆ వైద్యం వికటించడంతో ప్రమీల ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. వెంటనే ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను హుజూర్‌నగర్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి మరింత క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రమీల మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
క్రైమ్
ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి
క్రెడిట్: విక్రమ్ శ్రీరాముల
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!