హైదరాబాద్ నగరంలో ఉగ్రదాడి బెదిరింపు కలకలం సృష్టించింది. లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా నగరంలో భారీ దాడులు చేస్తామని హైదరాబాద్ పోలీసులకు బెదిరింపు ఈ-మెయిల్ రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్ మరియు కాచిగూడలోని హోటల్ టూరిస్ట్ ప్లాజాలో జంట బాంబు పేలుళ్లు జరుపుతామని ఆ మెయిల్‌లో హెచ్చరించారు. ముంబై 26/11 తరహా దాడులను పునరావృతం చేసి, కనీసం 300 మందిని చంపడమే తమ లక్ష్యమని దుండగులు పేర్కొన్నారు.ఈ బెదిరింపు మెయిల్‌ను తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడంతో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, రద్దీగా ఉండే ప్రజా ప్రదేశాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల బెదిరింపు కలకలం..
క్రెడిట్: విక్రమ్ శ్రీరాముల
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!