ప్రపంచ గణిత శాస్త్ర చరిత్రలో అత్యంత క్లిష్టమైన మరియు 167 ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన రీమన్ హైపోథిసిస్ రహస్యాన్ని ఛేదించినట్లు ప్రముఖ కృత్రిమ మేధస్సు సంస్థ 'ఆంథ్రోపిక్' కు చెందిన గణిత శాస్త్రవేత్త లెవెంట్ ఆల్పేజ్ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తమ సంస్థ అభివృద్ధి చేసిన 'క్లాడ్ ఏఐ' సహాయంతో తాను ఈ అసాధ్యమైన గణిత సమస్యకు పరిష్కారం కనుగొన్నట్లు ఆయన తన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో వెల్లడించారు. 

ముగింపు దశలో అద్భుతంగా పనిచేసిన క్లాడ్ ఏఐ:


ప్రధాన సంఖ్యల పంపిణీ గురించి 1859లో జర్మనీకి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త బెర్న్‌హార్డ్ రీమన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులు సైతం దీనిని నిరూపించలేకపోయారు. "ఈ సమస్య పరిష్కారం కోసం నేను సరైన దిశను చూపగా, ముగింపు రేఖ వద్ద క్లాడ్ ఏఐ నన్ను ఆశ్చర్యపరిచింది. అది అద్భుతంగా పనిచేస్తూ పరిష్కారాన్ని పూర్తి చేసింది" అని ఆల్పేజ్ పేర్కొన్నారు.