ప్రపంచ వేదికపై వేగంగా ఎదుగుతున్న భారత్ ఆర్థిక, సైనిక శక్తిని అడ్డుకునేందుకు చైనా దీర్ఘకాలిక కుట్రలు పన్నుతోందని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన 'అమెరికా-చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్' 2026 వార్షిక నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. నవంబర్ 18న అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన ఈ నివేదికలో, 2025 మే నెలలో జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో నేరుగా యుద్ధంలోకి దిగకుండానే చైనా పాకిస్థాన్‌కు పరోక్షంగా భారీ సహకారం అందించిందని స్పష్టం చేసింది. 2026 ఫిబ్రవరి నాటి కమిషన్ విచారణ, భారత్‌లో జరిపిన నిజనిర్ధారణ పర్యటనలు మరియు నిపుణుల పరిశోధనల ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించారు.
ఆపరేషన్ సింధూర్‌లో పాక్‌కు చైనా అండ:
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' సమయంలో పాకిస్థాన్‌కు చైనా అధునాతన ఆయుధాలు, సాంకేతిక సహకారం, నిఘా సమాచారం అందించడంతో పాటు సైబర్ కార్యకలాపాలకు పాల్పడిందని నివేదిక పేర్కొంది. 1962 భారత్-చైనా యుద్ధం నాటి నుండే భారత్‌ను కట్టడి చేసేందుకు చైనా పాకిస్థాన్‌ను ఒక పావుగా వాడుకుంటోందని, దీనివల్ల భవిష్యత్తులో భారత్‌కు రెండు సరిహద్దుల యుద్ధ ముప్పు మరింత పెరిగిందని కమిషన్ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో భారత్ రక్షణ పరంగా అత్యంత అప్రమత్తంగా ఉండాలని నివేదిక సూచించింది. చైనా వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమెరికా-భారత్ మధ్య రక్షణ సాంకేతికత, నిఘా సమాచార మార్పిడి, సముద్ర భద్రత మరియు తయారీ రంగాలలో సహకారం మరింత బలోపేతం కావాలని కమిషన్ సిఫార్సు చేసింది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!