ఫ్రాన్స్: తెలంగాణను అంతర్జాతీయ ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తెలంగాణలో సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా పారిస్ సమీపంలోని సఫ్రాన్ తయారీ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించి సంస్థ ప్రతినిధులతో చర్చించారు. హైదరాబాద్‌లో సంస్థ కార్యకలాపాల విస్తరణ, కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చలు జరిగాయి. డిసెంబర్ 2026లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడికి సంబంధించి ఎంఓయూ కుదిరే అవకాశం ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగానికి మరింత ఊతం లభించనుంది.