ప్రపంచంలోనే విస్తీర్ణం పరంగా అతిపెద్ద విమానాశ్రయంగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఈ విమానాశ్రయం మొత్తం విస్తీర్ణం అక్షరాలా 776 చదరపు కిలోమీటర్లు. ఇంతటి భారీ విస్తీర్ణం ఉండటంతో బహ్రెయిన్ వంటి చిన్న దేశాల భూభాగంతో పోల్చదగిన స్థాయిలో ఈ ఎయిర్‌పోర్టు నిలిచింది.
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మొత్తం 776 చదరపు కిలోమీటర్లలో విమాన కార్యకలాపాలు, ప్రయాణికుల సేవల కోసం ప్రస్తుతం సుమారు 37 నుంచి 43 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని మాత్రమే వినియోగిస్తున్నారు. మిగిలిన భూభాగాన్ని భవిష్యత్తు విస్తరణ, ఇతర అవసరాల కోసం కేటాయించారు.
ఈ విమానాశ్రయంలో ఆరు అంతస్తుల ప్రధాన టెర్మినల్ ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. ప్రయాణికుల సౌకర్యార్థం టెర్మినల్‌కు అనుసంధానంగా భారీ మసీదును కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సౌదీ రాజకుటుంబ సభ్యులు, విదేశీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రాయల్ టెర్మినల్ అందుబాటులో ఉంది. భారీ విమానాల రాకపోకలకు అనువుగా నాలుగు కిలోమీటర్ల పొడవైన రెండు రన్‌వేలను నిర్మించారు. అత్యాధునిక నావిగేషన్, విమానయాన సాంకేతిక సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
ప్రయాణికుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో ఇది ముందంజలో లేకపోయినా, భూవిస్తీర్ణం విషయంలో మాత్రం తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒక విమానాశ్రయం ఇంతటి భారీ విస్తీర్ణంలో ఉండటం నిజంగా ప్రపంచానికే ఆశ్చర్యం కలిగించే విషయం!
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!