కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ హనుమాన్ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అభిషేకాల అనంతరం వివిధ రకాల పండ్లతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించటం జరిగింది. పండ్లతో రూపొందించిన విశేష అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం జరిగింది.
కార్తీక పౌర్ణమి పర్వదినాన ప్రదోష కాలంలో ఆకాశ దీపారాధన కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించనున్నారు. అనంతరం జ్వాలాతోరణం కార్యక్రమం జరగనుంది. ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు శ్రీ రిపుంజయ శర్మ తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ నాయుడు అధికారి శ్రీనివాస్ గౌడ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!